News August 18, 2024
కోల్‌కతా ఘటన.. క్షమాపణలు చెప్పిన TMC ఎంపీ

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై తాను షేర్ చేసిన వీడియోలో బాధితురాలి పేరును ప్రస్తావించినందుకు TMC ఎంపీ, నటి రచనా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. భావోద్వేగంతో మాట్లాడుతుండగా ఆమె పేరు అనుకోకుండా చెప్పినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా నుంచి వీడియోను డిలీట్ చేసినట్లు తెలిపారు. అంతకుముందు వీడియో వైరలవ్వడంతో ఎంపీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సచిన్ ఆమెపై హైకోర్టులో ఫిర్యాదు చేశారు.
Similar News
News December 4, 2025
సాయుధ దళాల పతాక వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కె.వెట్రి సెల్వి గురువారం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సాయుధ దళాల పతాక నిధికి మొదటి విరాళాన్ని అందజేశారు. భారత సైనిక దళాల దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తుందని కలెక్టర్ అన్నారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సింధూరం’, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను సైనికులు దేశం గర్వించేలా కృషి చేశారని కొనియాడారు.
News December 4, 2025
టోల్ ప్లాజాస్ @ 25 ఇయర్స్

దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP)లో టోల్ ప్లాజాలు ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ప్రభుత్వ రహదారులు, బ్రిడ్జిలపై టోల్ వసూలుకు 1851లో చట్టం చేశారు. 1970లలో దేశంలో రహదారుల నిర్మాణం, టోల్ వసూలు పద్ధతులు ప్రవేశపెట్టారు. 2000 నుంచి ప్రారంభమైన టోల్ ప్లాజాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తోంది. 2024-25లో రూ.73 వేల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది రూ.80 వేల కోట్లు వసూలు కావొచ్చని అంచనా.
News December 4, 2025
‘అఖండ-2’ మూవీ.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

అఖండ2 ప్రీమియర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్‌కు డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ఉండవని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ఓవర్సీస్లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ఉంటాయంది. ఇవాళ రాత్రి గం.8 నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చినా టికెట్స్‌పై సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.


