News August 18, 2024

కోల్‌కతా ఘటన.. క్షమాపణలు చెప్పిన TMC ఎంపీ

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై తాను షేర్ చేసిన వీడియోలో బాధితురాలి పేరును ప్రస్తావించినందుకు TMC ఎంపీ, నటి రచనా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. భావోద్వేగంతో మాట్లాడుతుండగా ఆమె పేరు అనుకోకుండా చెప్పినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా నుంచి వీడియోను డిలీట్ చేసినట్లు తెలిపారు. అంతకుముందు వీడియో వైరలవ్వడంతో ఎంపీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సచిన్ ఆమెపై హైకోర్టులో ఫిర్యాదు చేశారు.

Similar News

News September 8, 2024

మున్నేరుకు వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

image

TG: మహబూబాబాద్, ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఖమ్మం సిటీలో పరీవాహక ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రభావిత కాలనీల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

News September 8, 2024

నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు: బ్రహ్మాజీ

image

వైసీపీ చీఫ్ జగన్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన <<14049130>>ట్వీట్<<>> వైరలవ్వడంపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. తన X అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News September 8, 2024

జాగ్రత్త.. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు

image

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం తెలిపింది. ఇవాళ జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిన్న MHBD, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.