News March 11, 2025

RRR, పెండింగ్ రహదారులపై కోమటిరెడ్డి విజ్ఞప్తి

image

TG: ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పెండింగ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్డుపై చర్చించారు. RRRకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, యాదగిరిగుట్ట ఆలయం, భువనగిరి కోట, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జునసాగర్, మంథనిలోని రామగిరి కోటకు రోప్‌వే వేయాలని కోరారు. HYD-విజయవాడ NH-65ను 6 లేన్లుగా విస్తరించే DPR తయారీని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 19, 2025

రాత్రికి రాత్రే YSR పేరు తొలగించారు: వైసీపీ

image

AP: విశాఖపట్నంలో కూటమి నాయకుల ఉన్మాదం పతాక స్థాయికి చేరిందని వైసీపీ ఆరోపించింది. ‘వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న YSR పేరును టీడీపీ నేతలు తొలగించారు. రాత్రికి రాత్రే డా.వైఎస్సార్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్చారు. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు’ అని Xలో ఫొటోలు పోస్ట్ చేసింది.

News March 19, 2025

పాకిస్థాన్‌లో చైనా ఆర్మీ..!

image

పాకిస్థాన్‌లో ఆర్మీ, ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించేలా చైనా ఒప్పందం చేసుకుంది. సీపెక్ ప్రాజెక్టులోని చైనా కార్మికులని, ఇంజినీర్లను కాపాడేందుకు వీలుగా ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంతో డ్రాగన్ దేశానికి చెందిన పలు భద్రతా ఏజెన్సీలు పాక్‌లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షిస్తాయి. పాక్‌లో బలూచిస్థాన్ వేర్పాటు వాదుల దాడుల నేపథ్యంలో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News March 19, 2025

ఐదేళ్లలో రైలు టికెట్ ధరలు పెంచలేదు: కేంద్ర మంత్రి

image

దేశంలో గత ఐదేళ్లలో రైలు ఛార్జీలు పెంచలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ LSలో వెల్లడించారు. పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే మన దేశంలోనే టికెట్ ధరలు తక్కువని చెప్పారు. 350 కి.మీ దూరానికి మన దేశంలో ఛార్జ్ రూ.121గా ఉంటే, పాకిస్థాన్‌లో రూ.436, బంగ్లాలో రూ.323, శ్రీలంకలో రూ.413 అని వివరించారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంతో పోల్చితే ఇప్పుడు 90% రైలు ప్రమాదాలు తగ్గాయన్నారు.

error: Content is protected !!