News September 9, 2024
IIHTకి కొండా లక్ష్మణ్ పేరు: CM
TG: IIHTకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకుందామని CM రేవంత్ అన్నారు. నాంపల్లిలో IIHT(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కొండా లక్ష్మణ్ గౌరవం పెంచేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగాలతో పోల్చి తేడా గమనించాలని ప్రజలను కోరారు. BRS భవనం కోసం కొండా స్థలం ఇచ్చారని పేర్కొన్నారు.
Similar News
News October 12, 2024
పెరిగిన బంగారం, వెండి ధరలు
దసరా రోజున కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.77,670 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.250 ఎగసి రూ.71,200కి చేరుకుంది. గత రెండు రోజుల్లోనే 10 గ్రాములపై గోల్డ్ ధర రూ.1000కి పైగా పెరిగింది. కేజీ సిల్వర్ ధర రూ.1,000 పెరగడంతో రూ.1,03,000 పలుకుతోంది.
News October 12, 2024
అత్యాచార ఘటన.. సీఎం కీలక ఆదేశాలు
AP: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై జరిగిన అత్యాచార <<14338493>>ఘటనపై <<>>సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. అటు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
News October 12, 2024
ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ITBPలో 545 కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10% ఖాళీలను ఎక్స్-సర్వీస్‌మెన్‌కు కేటాయించారు. టెన్త్ పాసైన 21 నుంచి 27 ఏళ్లు వారు దరఖాస్తుకు అర్హులు. హెవీ వాహనాలు నడిపే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారికి ₹21,700-69,100 పేస్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. ఫీజు ₹100. మరిన్ని వివరాలకు ఇక్కడ <