News February 10, 2025
రంగరాజన్‌ను పరామర్శించిన కొండా సురేఖ

TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడి గురించి ఆమె ఆరా తీశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా పూజారిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 28, 2025
30 బంతుల్లో 31.. కోహ్లీపై ట్రోల్స్

చెన్నైతో మ్యాచులో విరాట్ కోహ్లీ ఇన్నింగ్సుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. విరాట్ ఓపెనింగ్ వచ్చి 30 బంతుల్లో 31 రన్స్ చేసి ఔటయ్యారు. టీ20లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడారని ఎద్దేవా చేస్తున్నారు. చాలా షాట్లు కనెక్ట్ చేయలేకపోయారని పోస్టులు చేస్తున్నారు. పిచ్ కఠినంగా ఉందని, అక్కడ వేగంగా ఆడటం కష్టమని కోహ్లీ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. మరి ఇవాళ్టి కోహ్లీ ఇన్నింగ్సుపై మీ కామెంట్?
News March 28, 2025
బాబోయ్ ఎండలు.. రేపు 223 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. కమలాపురం, తాటిచెర్లలో 42.6, ఆలమూరులో 42.5, వెంకటగిరిలో 42.2, రావికమతంలో 42.1, వతలూరులో 42 డిగ్రీలు నమోదయ్యాయని తెలిపింది. రేపు 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 223 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం <
News March 28, 2025
మీకు తెలుసా?.. రూ.45కోట్ల బడ్జెట్…రూ. లక్ష దాటని కలెక్షన్స్

బాలీవుడ్‌లో గతేడాది వచ్చిన లేడీ కిల్లర్ చిత్రం రూ.45కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ వంటి స్టార్‌లు నటించారు. ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్‌గా నిలిచింది. ఇందులో విషయమేముంది అనుకుంటున్నారా? ఈ మూవీ మెుదటి వారం రూ.1లక్ష కంటే తక్కువే వసూలు చేసిందట. అంతే కాకుండా, కొనుగోలు చేయడానికి OTTలు రాకపోవడంతో నిర్మాణ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో మూవీని రిలీజ్ చేశారు.