News August 9, 2024

కళ్లు తిరిగి పడిపోయిన కొరియా మెడలిస్ట్

image

పారిస్ ఒలింపిక్స్‌లో వెండి పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియా షూటర్ కిమ్ యె-జీ ప్రెస్ మీట్‌లో కళ్లు తిరిగి పడిపోయారు. ఒత్తిడి, అలసట కారణంగా ఆమె నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. షూటింగ్ సమయంలో ఆమె కూల్‌గా వ్యవహరించి వెండి పతకం గెలుచుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. టర్కీ షూటర్ యూసుఫ్ తరహాలోనే ఆమెకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

Similar News

News September 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 19, 2024

J&K తొలి విడత ఎన్నికలు.. 59 శాతం పోలింగ్ నమోదు

image

పదేళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కిశ్త్‌వాడ్‌లో అత్యధికంగా 77శాతం, పుల్వామాలో అత్యల్పంగా 46శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. J&Kలో 90 స్థానాలుండగా ఫస్ట్ పేజ్‌లో 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.

News September 19, 2024

‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు

image

AP: గత ప్రభుత్వ హయాంలో అమలైన మరో పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ‘వైఎస్సార్ లా నేస్తం’ స్కీమ్ పేరును ‘న్యాయమిత్ర’గా మారుస్తూ న్యాయశాఖ కార్యదర్శి సునీత ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పథకం కొత్త మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామని తెలిపారు. న్యాయమిత్ర ద్వారా జూనియర్ లాయర్లకు స్టైఫండ్ అందిస్తారు.