News July 21, 2024
క్యూ1లో రాణించిన కోటక్ మహీంద్రా, HDFC, యస్ బ్యాంక్
FY25 తొలి త్రైమాసిక (APR-JUN) ఫలితాల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ భారీ లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలోని క్యూ1తో పోలిస్తే ఈసారి నికర లాభం 81% వృద్ధి చెంది ₹6,250 కోట్లుగా నమోదైంది. FY24 Q1లో ఈ మొత్తం ₹3452 కోట్లగా ఉంది. యస్ బ్యాంక్ సైతం క్యూ1లో ₹502 కోట్ల (46.4% వృద్ధి) నికర లాభాన్ని ఆర్జించింది. ఇక HDFC బ్యాంక్ క్యూ1లో ₹16474.85 కోట్ల (35.3% వృద్ధి) నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది.
Similar News
News December 10, 2024
జైళ్ల శాఖలో ఖాళీల వివరాలివ్వండి.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
జైళ్ల శాఖలో ఉన్న పోస్టులు, ఖాళీలు-వాటి భర్తీ చర్యల వివరాలు సమర్పించాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కారాగారాలు నిండిపోతుండడంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ హృషికేశ్ రాయ్ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. జైళ్లు నిండిపోయి కారాగారాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు ఖైదీలు, విచారణ ఖైదీల సమస్యలు పెరిగే అవకాశముందని పేర్కొంది. వివరాలు సమర్పించేందుకు 8 వారాల గడువిచ్చింది.
News December 10, 2024
BREAKING: మోహన్ బాబుకు పోలీసుల నోటీసులు
TG: <<14843588>>మీడియాపై దాడి<<>> నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు విష్ణు, మనోజ్‌కు నోటీసులిచ్చారు. వీరిని రేపు ఉదయం 10.30 గంటలకు CP కార్యాలయానికి హాజరు కావాలన్నారు. కాగా మోహన్ బాబు గన్‌ను పోలీసులు సరెండర్ చేసుకున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News December 10, 2024
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం ట్వీట్
TG: డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘4 కోట్ల ప్రజల మనోఫలకాలపై నిండైన రూపంగా నిన్నటి వరకు నిలిచిన తెలంగాణ తల్లి నేడు సచివాలయ నడిబొడ్డున నిజమైన రూపంగా అవతరించిన శుభ సందర్భం. ఇది తల్లి రుణం తీసుకున్న తరుణం’ అని Xలో రాసుకొచ్చారు.