News May 10, 2024
క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు

TG: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ ఫేక్ రిపోర్టు చూపించారని పోస్ట్ చేయడంతో క్రిశాంక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు పంపించారు. క్రిశాంక్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించిన విషయం తెలిసిందే.
Similar News
News March 13, 2026
పౌల్ట్రీ పరిశ్రమపై వార్ ఎఫెక్ట్.. గుడ్ల ధర పతనం

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం దేశీయ పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావాల్సిన కోడిగుడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పోర్టుల నుంచి కోడి గుడ్ల లోడ్ వెనక్కి రావడంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. యుద్ధానికి ముందు ఒక కోడి గుడ్డు ధర రూ.7 వరకూ ఉండగా.. ప్రస్తుతం అది కొన్నిచోట్ల రూ.4, రూ.3.50కు పడిపోయింది.
News March 13, 2026
పంట రుణాల పరిమితి ఖరారు

TG కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ FY2026-27కి గాను పంట రుణాల పరిమితిని ఖరారు చేసింది. ఎకరా వరి సాధారణ సాగుకు ₹48,000, SRIకి ₹38K, విత్తనోత్పత్తికి ₹51K, పత్తి(నీటి వసతి) ₹52K, వర్షాధారం ₹50K, విత్తనోత్పత్తికి ₹1.50Lగా నిర్ణయించింది. మిరప(సాధారణ సాగు) ₹90K, మల్చింగ్ ₹లక్ష, మొక్కజొన్న(₹38K, ₹32K, స్వీట్‌కార్న్ ₹43K), కంది(₹27K, ₹23K, ₹25K), పసుపు ₹92K, టమాటా ₹58K, ఉల్లి ₹49K, పెసలు (₹20K, ₹22K)గా ఉంది.
News March 13, 2026
డాల్బీ ఫార్మాట్‌లో ‘పెద్ది’

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అడ్వాన్స్‌డ్ డాల్బీ ఫార్మాట్‌లో విడుదల(ఏప్రిల్ 30) కానున్న తొలి టాలీవుడ్ మూవీగా నిలవనుంది. దీంతో హైపర్ రియలిస్టిక్ వీడియో, అద్భుతమైన సౌండ్‌తో చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు వార్-2, కాంతార-2, GOAT చిత్రాలు రిలీజయ్యాయి.


