News May 10, 2024

క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు

image

TG: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ ఫేక్ రిపోర్టు చూపించారని పోస్ట్ చేయడంతో క్రిశాంక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు పంపించారు. క్రిశాంక్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించిన విషయం తెలిసిందే.

Similar News

News January 25, 2026

AUలో నియామకాలపై విజిలెన్స్ విచారణ

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొన్నేళ్లుగా జరిగిన నియామకాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ముగ్గురు అధికారులతో కూడిన బృందం ఐదు రోజులుగా విభాగాల వారీగా తనిఖీలు నిర్వహిస్తోంది. 2018-2024 మధ్య జరిగిన నియామకాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే దీనిపై అన్ని విభాగాలలోని అధికారులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించింది. ఈ విచారణ మరికొన్ని రోజులు కొనసాగనుంది.

News January 25, 2026

JNCASRలో ఉద్యోగాలు

image

జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(<>JNCASR<<>>) 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, బీకామ్, బీఈ/బీటెక్, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ/DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.jncasr.ac.in

News January 25, 2026

సూర్యుడి రథం మనకు బోధించే పాఠాలివే..

image

సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుంది. అది ఏడాది కాలానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 రుతువులను సూచిస్తాయి. రథానికి కట్టిన 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులను(VIBGYOR) సూచిస్తాయి. అలాగే మన శరీరమే ఒక రథంగా చెప్పవచ్చు. బుద్ధిని సారథిగా భావించవచ్చు. మనస్సును పగ్గాలుగా పరిగణించవచ్చు. ఈ రథాన్ని నడిపించే ఆత్మ స్వరూపం సూర్యుడు. నిరంతరం ముందుకు సాగడమే సూర్యుని గుణం. అది మన జీవన ప్రయాణానికి స్పూర్తి.