News May 26, 2024
నీటి నిల్వలో కృష్ణా నది నంబర్-1

దేశంలో పెద్ద నదులైన(ప్రవహించే పొడవు పరంగా) గంగా, గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యంలో కృష్ణా అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం నదుల పరిధిలో నిర్మాణం పూర్తయిన జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 TMCలు ఉండగా, 1,788.99 TMCల కెపాసిటీతో కృష్ణా టాప్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల సామర్థ్యం 589.67 TMCలు. కాగా గంగా బేసిన్లో 1,718 TMCలు, గోదావరిలో 1,237 TMCల స్టోరేజ్ కెపాసిటీ ఉంది.
Similar News
News January 23, 2026
WPL: యూపీపై గుజరాత్ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో యూపీ వారియర్స్పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.
News January 23, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.
News January 23, 2026
పీవీ సింధుపై సీఎంల ప్రశంసలు

ఇంటర్నేషనల్ కెరీర్లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


