News May 26, 2024

నీటి నిల్వలో కృష్ణా నది నంబర్-1

image

దేశంలో పెద్ద నదులైన(ప్రవహించే పొడవు పరంగా) గంగా, గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యంలో కృష్ణా అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం నదుల పరిధిలో నిర్మాణం పూర్తయిన జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 TMCలు ఉండగా, 1,788.99 TMCల కెపాసిటీతో కృష్ణా టాప్‌లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల సామర్థ్యం 589.67 TMCలు. కాగా గంగా బేసిన్‌లో 1,718 TMCలు, గోదావరిలో 1,237 TMCల స్టోరేజ్ కెపాసిటీ ఉంది.

Similar News

News February 19, 2025

6నెలల్లో క్యాన్సర్ టీకా అందుబాటులోకి: కేంద్రమంత్రి

image

మహిళల్లో క్యాన్సర్‌ను నివారించేందుకు ఉపయోగపడే టీకాను మరో 6 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. 9 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకాలను అందిస్తామని వివరించారు. రొమ్ము, నోరు, గర్భాశయ క్యాన్సర్లను ఈ టీకా నియంత్రిస్తుందని, ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు.

News February 19, 2025

ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు ఆందోళన

image

ముంబై-దుబాయ్ ఎయిరిండియా విమానాన్ని అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. నిన్న రాత్రి 8 గంటలకు బయలుదేరాల్సిన విమానం 50 నిమిషాల తర్వాత ముంబైలో ల్యాండ్ చేశారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాక తెల్లవారుజామున 4 గంటలకు విమానం బయలుదేరింది. విమానంలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులే ఉన్నారు.

News February 19, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతలు వీరే

image

* 1998- దక్షిణాఫ్రికా
* 2000- న్యూజిలాండ్
* 2002- భారత్ & శ్రీలంక(సంయుక్తం)
* 2004- వెస్టిండీస్
* 2006- ఆస్ట్రేలియా
* 2009- ఆస్ట్రేలియా
* 2013- భారత్
* 2017- పాకిస్థాన్

error: Content is protected !!