News February 21, 2025
హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి కారణాలు లేకుండా తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించడంపై ఈ కేసులు నమోదయ్యాయి.
Similar News
News March 25, 2025
50 ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు: కూనంనేని

TG: అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకే వృద్ధులవుతున్నారని ఆయన అన్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రమ, మేధ దోపిడీ ఇక్కడే జరుగుతోందని పేర్కొన్నారు. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా, పగలు, రాత్రి తెలియకుండా వారు జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ఉద్యోగులపై దృష్టి సారించాలని కోరారు.
News March 25, 2025
రేపు 108 మండలాల్లో వడగాలుల ప్రభావం

AP: రేపు రాష్ట్రంలోని <
News March 25, 2025
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.