News October 18, 2024

గ్రూప్-1 అభ్యర్థులకు KTR భరోసా

image

TG: గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. సీఎం ఆదేశాలతో నిరుద్యోగులపై పోలీసులు జులుం చూపించారని మండిపడ్డారు. నిరుద్యోగులపై ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు BRS అండగా ఉంటుందని KTR భరోసా ఇచ్చారు. అటు అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News November 12, 2024

19న OTTలోకి థ్రిల్లర్ మూవీ

image

మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధ కాండం’ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది.

News November 12, 2024

కలెక్టర్‌పై దాడి చేయడమేంటి?

image

జిల్లా అధికార యంత్రాంగానికి బాస్ కలెక్టర్. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అమలు చేసేది ఆయనే. నిన్న వికారాబాద్ జిల్లాలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్యూరోక్రాట్లపై దాడి చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే అధికారులు ఫీల్డులో ధైర్యంగా పని చేయలేరని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 12, 2024

శత్రుదాడి జరిగితే పరస్పర రక్షణకు రష్యా, నార్త్ కొరియా డీల్

image

శత్రుదేశాలు యుద్ధానికి వస్తే ఒకరికొకరు సహాయంగా నిలబడేలా రష్యా, ఉత్తర కొరియా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఈ ఒప్పందం జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య సహకారం ఇటీవల బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్యాంగ్యాంగ్‌కు రష్యా ఆయుధ సాంకేతికత సరఫరా చేస్తుండగా అటు కిమ్ జాంగ్ వేలాదిమంది సైనికుల్ని ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యాకు సరఫరా చేస్తున్నారు.