News March 17, 2024
నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీశ్
TS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఏడు రోజుల కస్టడీ విధించింది. దీంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. వీరితోపాటు ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి జాన్సన్ నాయక్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. వీరందరూ కవితను కలవనున్నారు. కాగా కవిత అరెస్ట్‌పై ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం.
Similar News
News October 6, 2024
తొలి టీ20 నెగ్గేదెవరో?
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. నేడు గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. సూర్య కుమార్ నాయకత్వంలోని కుర్రాళ్లు బంగ్లా జట్టుపై ఎలాంటి ప్రదర్శన చేస్తారో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 14 టీ20లు జరగ్గా భారత్ 13 విజయాలు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ ఒక మ్యాచులో గెలుపొందింది. కాగా గ్వాలియర్‌లో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండటం గమనార్హం.
News October 6, 2024
నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు
TG: నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్‌లైన్‌లో <
News October 6, 2024
హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ
హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.