News December 5, 2024
KTR, హరీశ్‌ది చిన్నపిల్లల మనస్తత్వం: రేవంత్

TG: పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని BRS, ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేస్తున్న తమను విమర్శించడం ఏంటని CM రేవంత్ అన్నారు. ‘తొలి ఏడాదిలో 5నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల సచివాలయానికి వెళ్లలేకపోయాం. మిగిలిన 6నెలల్లో పరిపాలనను గాడిలో పెట్టాం. KTR, హరీశ్‌ది చిన్నపిల్లల మనస్తత్వం. మనదగ్గర లేని బొమ్మ పక్కోడి దగ్గర ఉంటే విరగ్గొట్టాలనే ఆలోచన ఉంటుంది. వారికి తెలియదేమో కానీ KCRకి కూడా అవగాహన లేదా?’ అని ప్రశ్నించారు.
Similar News
News January 23, 2026
శీతాకాలంలో పసిపిల్లల సంరక్షణ

శీతాకాలంలో నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డకు ఎప్పుడూ వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. సమయానికి తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదయం స్నానం చేయించిన తర్వాత బిడ్డను కాసేపు ఎండలో కూర్చోనివ్వాలి. చల్లని గాలి పడకుండా చూడాలి. ఫ్యాన్ లేదా ఏసీకి దూరంగా ఉంచాలి. ఏవైనా ఆరోగ్య సమస్యల లక్షణాలు కనిపిస్తే ఇంట్లో మందులు వేసి సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
News January 23, 2026
‘పెద్ది’పై క్రేజీ అప్‌డేట్.. చరణ్‌తో మృణాల్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్‌తో అలరించబోతున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీ కోసం మేకర్స్ అడిగిన వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. AR రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్ సిద్ధం చేయగా ఈ సాంగ్‌ను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించబోతున్నారని టాక్. ‘సీతారామం’తో తెలుగువారి మనసు గెలుచుకున్న ఈ భామ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుందనే వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
News January 23, 2026
వరుసగా 3 రోజులు సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లో కొందరికి వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ సహా పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు సోమవారం రిపబ్లిక్ డే రావడంతో లాంగ్ వీకెండ్ కానుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపట్నుంచి 3 రోజులు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.


