News January 16, 2025
కేటీఆర్ విచారణ.. ఈడీ ఆఫీస్ వద్ద హైడ్రామా

TG: ఈడీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. కేటీఆర్ విచారణ ముగిసిందని తెలిసి బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అక్కడే ఉంటామని పలువురు కార్యకర్తలు తెగేసి చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కేటీఆర్ బయటికి వస్తారా? లేదా? అని ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 18, 2025
వేరే పార్టీ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు?.. ఢిల్లీ LGపై ఠాక్రే ఫైర్

యమునా నది ప్రక్షాళన మొదలైందని, మూడేళ్లలో క్లీన్ చేస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యలపై MH మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే ఫైరయ్యారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ దీన్ని ప్రారంభించవచ్చు. కానీ రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇలాంటి స్వార్థ రాజకీయాల వల్లే ఇండియా వెనక్కి వెళ్తోంది’ అని ట్వీట్ చేశారు.
News February 18, 2025
అప్పులు చేయడానికి కేసీఆర్ రావాలా?: మంత్రి జూపల్లి

TG: కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలకు దిగారు. ఆయన తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునేది మళ్లీ అప్పులు చేయడానికేనా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఉందని దుయ్యబట్టారు. సర్పంచ్ బిల్లులు బకాయిలు పెట్టి ఇప్పుడు ఇవ్వట్లేదని అనడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాలుగు స్తంభాల ఆట నడిచిందని విమర్శించారు.
News February 18, 2025
బయట ఫుడ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా?

రెస్టారెంట్ ఫుడ్ తినడంలో చైనా, అమెరికా, సింగపూర్ దేశాలు ముందున్నాయి. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీనికి డా.సుధీర్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. ‘ఇందులో మేము సింగపూర్ & ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉన్నా పర్లేదు. ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారం అత్యంత ఆరోగ్యకరమైన ఎంపిక. బయట ఫుడ్ వల్ల ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తవచ్చు’ అని తెలిపారు.