News January 9, 2025
ఏసీబీ విచారణకు బయల్దేరిన కేటీఆర్
TG: ఫార్ములా-e రేసు కేసులో KTR నందినగర్ నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయల్దేరారు. కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్ రావు ఆయనతో పాటు వెళ్తున్నారు. కాగా, విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే లాయర్‌ను అనుమతించనున్నారు. కేటీఆర్ విచారణ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ACB ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. IAS దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు KTRను విచారించనున్నారు.
Similar News
News January 9, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టికెట్ ధరల పెంపు
AP: విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర అదనంగా రూ.125 పెంచుకునేందుకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.100 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సినిమా రిలీజయ్యే ఈ నెల 14న 6 షోల నిర్వహణకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి 23 వరకు అదనపు ధరల వసూలుకు పర్మిషన్ ఇచ్చింది.
News January 9, 2025
TCS షేర్లకు రూ.76 డివిడెండ్
Q3లో TCS నికర లాభం 12% పెరిగి ₹12,380 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే Dec క్వార్టర్‌లో లాభం ₹11,058 కోట్లుగా ఉంది. తాజా ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఒక్కో షేరుకు ₹10 మధ్యంతర డివిడెండ్‌తోపాటు ₹66 స్పెషల్ డివిడెండ్ చెల్లించనున్నట్టు సంస్థ ప్రకటించింది. జనవరి 17ను రికార్డు డేట్‌గా ప్రకటించింది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లించనుంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారం షేరు ధర 1.57% పతనమైంది.
News January 9, 2025
దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి
మలయాళ దిగ్గజ గాయకుడు పి జయచంద్రన్(80) ఈరోజు కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆరు దశాబ్దాలకు పైగా మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 16వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందిన జయచంద్రన్‌కు 5సార్లు కేరళ రాష్ట్ర పురస్కారం, తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.