News October 23, 2024
బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీస్
TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆయన అందులో పేర్కొన్నారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని స్పష్టం చేశారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డాడని సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
Similar News
News November 13, 2024
WHATSAPP యూజర్లే టార్గెట్‌గా సైబర్ క్రిమినల్స్ కొత్త స్కామ్
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వేలాదిగా జంటలు పెళ్లిపీటలు ఎక్కనున్నాయి. ఇదే అదనుగా సైబర్ క్రిమినల్స్ పాత APK స్కామ్‌నే మళ్లీ కొత్తగా మొదలుపెట్టారు. తెలియని ఫోన్ నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు పెళ్లి ఇన్విటేషన్ పంపిస్తారు. అందులో APK ఫైల్ ఉంచుతారు. దాన్ని తెరవగానే మీ మొబైల్లో సీక్రెట్‌గా ఇన్‌స్టాలై బ్యాంకు, పర్సనల్ డేటాను దొంగిలిస్తుంది. దీని ఆధారంగా క్రిమినల్స్ మీ బ్యాంకులోని డబ్బును దోచుకుంటారు.
News November 13, 2024
బ్రదర్.. ఇకనైనా లేచి పాదాలకు పనిచెప్పు!
కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటే ప్రమాదకరమని తెలిసినా లేచి నడిచేందుకు కొందరు ఇష్టపడరు. ఇలా సుదీర్ఘంగా కూర్చొని పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 2 గంటల పాటు కుర్చీలో కూర్చోవడం సిగరెట్ తాగినంత హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే మధుమేహం, గుండె జబ్బులొస్తాయి. మెడ, వెనుక భాగంలో నొప్పి వస్తుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పడిపోతుంది. SHARE IT
News November 13, 2024
బ్రేకప్‌తో కుంగిపోయా: రాశి ఖన్నా
తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక ఎంతో కుంగిపోయినట్లు హీరోయిన్ రాశి ఖన్నా తెలిపారు. తాను నటించిన ‘ది సబర్మతి రిపోర్టు’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘గతంలో నాకు ఓ లవ్ స్టోరీ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అతడితో బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా.. కుంగిపోయా. ఆ తర్వాత ఆ బాధ నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి పెట్టా. ఇప్పుడు నా ఫ్యామిలీ, ఫ్రెండ్సే నాకు అండ’ అని ఆమె చెప్పుకొచ్చారు.