News February 7, 2025
బీసీ నేతలతో కేటీఆర్ భేటీ

TG: అందుబాటులో ఉన్న బీసీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో ఆయన సమావేశమై బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News March 17, 2025
TODAY HEADLINES

* రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం
* అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం: సీఎం
* హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
* KCR జాతిపిత.. రేవంత్ బూతుపిత: హరీశ్‌రావు
* తాగుబోతోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా?: రేవంత్
* ఎ.ఆర్. రెహమాన్‌కు ఛాతీ నొప్పి, ఆస్పత్రిలో చేరిక
* యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు
* నా బాల్యమంతా తీవ్ర పేదరికంలోనే: PM మోదీ
* IML విజేతగా టీమ్ ఇండియా
News March 17, 2025
IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
News March 17, 2025
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.