News May 24, 2024
KTR, RSP క్షమాపణలు చెప్పాలి: జూపల్లి

TG: BRS హత్యారాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని, కుటుంబ తగాదాల వల్లే ఆయనను హత్య చేశారన్నారు. హత్యలకు, రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని.. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వారు తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News April 18, 2026
ALERT: ఎండలో బయటికెళ్తున్నారా?

ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన తలనొప్పి, 104 డిగ్రీలకు పైగా జ్వరం, వాంతులు, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం ఎర్రబడి పొడిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయొద్దని చెబుతున్నారు. నివారణకు తరచుగా నీరు, ORS తాగాలని, మధ్యాహ్నం వేళ ప్రయాణాలు తగ్గించి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. SHARE IT
News April 18, 2026
రష్యా చమురు కొనుగోలుకు US అనుమతుల పొడిగింపు

రష్యా నుంచి భారత్ సహా ఇతర దేశాలు చమురు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతులను అమెరికా మరో నెల రోజులపాటు పొడిగించింది. మే 16 వరకు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఇది ఇరాన్, క్యూబా, ఉ.కొరియాతో జరిగే లావాదేవీలకు వర్తించదని పేర్కొంది. యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలను నియంత్రించడానికి US ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అనుమతులను పొడిగించబోమని 2రోజుల క్రితం US చెప్పడం గమనార్హం.
News April 18, 2026
ఎండాకాలంలో మీ ఫోన్ వేడెక్కుతోందా?

వేసవిలో తీవ్రమైన వేడి వల్ల స్మార్ట్‌ఫోన్లు త్వరగా వేడెక్కడమే కాకుండా వాటి పనితీరూ నెమ్మదిస్తోంది. ఓవర్ హీట్ వల్ల ఫోన్ హ్యాంగ్ అవడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి సమస్యలొస్తుంటాయి. వీటిని నివారించేందుకు ఫోన్‌ను నేరుగా ఎండలో వాడకూడదని, బ్యాక్ కవర్ తీసేసి ఛార్జింగ్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రైట్‌నెస్ తగ్గించడం, అవసరం లేనప్పుడు డేటా, బ్లూటూత్ ఆఫ్ చేస్తే బ్యాటరీ లైఫ్ కాపాడుకోవచ్చని చెబుతున్నారు.


