News September 7, 2024

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ సెటైర్లు

image

TG: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ <<14035008>>ర్యాంకింగ్స్‌లో<<>> తెలంగాణ పేలవ ప్రదర్శనను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ ఘనతను వర్ణించేందుకు తనకు మాటలు రావట్లేదని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలోనే స్వచ్ఛ్ బయో, వాల్ష్ కర్రా వంటి ఆవిష్కరణలు అవసరమని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తొమ్మిది నెలల పాలనలో ఇలా ఉంటే రాబోయే నాలుగేళ్లలో జరిగేవి తలుచుకుంటే భయమేస్తుందన్నారు.

Similar News

News December 21, 2024

కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ <<14942476>>అసెంబ్లీలో<<>> సీఎం రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌పై ఆయనతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బన్నీ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

News December 21, 2024

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేనా?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 3 గ్రూప్ మ్యాచులు ఆడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తలపడుతుందని తెలుస్తోంది. కాగా గ్రూప్-1లో ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉంటాయని, గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా ఉంటాయని సమాచారం.

News December 21, 2024

అల్లు అర్జున్‌ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా?

image

‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో ఉన్న బాలుడిని కాకుండా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ని సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందని, ఆయనకు జైలు తప్పదేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి.