News September 7, 2024
కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
TG: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ <<14035008>>ర్యాంకింగ్స్‌లో<<>> తెలంగాణ పేలవ ప్రదర్శనను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ ఘనతను వర్ణించేందుకు తనకు మాటలు రావట్లేదని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలోనే స్వచ్ఛ్ బయో, వాల్ష్ కర్రా వంటి ఆవిష్కరణలు అవసరమని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తొమ్మిది నెలల పాలనలో ఇలా ఉంటే రాబోయే నాలుగేళ్లలో జరిగేవి తలుచుకుంటే భయమేస్తుందన్నారు.
Similar News
News October 5, 2024
భయానకం.. 600 మందిని కాల్చేశారు
ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో భయానక ఘటన చోటుచేసుకుంది. బర్సాలోగోలో అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థ JNIM దాడుల్లో గంటల వ్యవధిలోనే 600 మంది ప్రజలు చనిపోయారు. AUG 24న జరిగిన ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌లపై వచ్చిన దుర్మార్గులు కనిపించినవారినంతా కాల్చేశారు. ఆ మృతదేహాలను తొలగించడానికి 3 రోజలు పట్టింది. ఆర్మీ, టెర్రరిస్టులకు మధ్య 2015 నుంచి కొనసాగుతున్న ఘర్షణల్లో 20వేల మంది మరణించారు.
News October 5, 2024
దసరా సెలవుల్లోనూ క్లాసులు.. విద్యార్థుల ఆవేదన
AP: ఈ నెల 2 నుంచే దసరా సెలవులు ప్రారంభమైనా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులకు హాజరుకావాలని విద్యార్థులకు స్పష్టం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా సెలవులతో సిలబస్ పూర్తికాలేదనే నెపంతో పిల్లలకు దసరా ఆనందాలను దూరం చేస్తున్నాయి. ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
News October 5, 2024
ఆన్‌లైన్ బెట్టింగ్.. 2 కుటుంబాలు బలి
ఆన్‌లైన్ బెట్టింగ్ కుటుంబాల్లో విషాదం నింపుతోంది. తెలంగాణలోని వడ్డేపల్లి(నిజామాబాద్)లో హరీశ్ అనే యువకుడు రూ.50 లక్షలకుపైగా కోల్పోయాడు. పేరెంట్స్ పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో ముగ్గురూ ఉరివేసుకున్నారు. ఏపీలోని గంగాధర నెల్లూరు(చిత్తూరు)లో దినేశ్ రూ.కోటి పోగొట్టుకున్నాడు. ఆ మొత్తాన్ని తీర్చలేక తల్లిదండ్రులు, అక్కతోపాటు పురుగుమందు తాగాడు. పేరెంట్స్ చనిపోగా, అక్క, సోదరుడు చికిత్స పొందుతున్నారు.