News January 6, 2025

ఈడీ విచారణకు గడువు కోరిన కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ కారు రేసులో ఈడీ పంపిన నోటీసులపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. రేపు విచారణకు హాజరుకావడం లేదని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చే వరకు తనకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 17, 2025

అతడి వల్లే భారత్ ఓడిపోయింది: అశ్విన్

image

BGTలో టీమ్ ఇండియా ఓడిపోవడానికి ఆస్ట్రేలియా బౌలర్ బోలాండే కారణమని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ‘కమిన్స్ అద్భుతంగా రాణించారని అందరూ అంటున్నారు. కానీ అతడు లెఫ్ట్ హ్యాండర్లకు బౌలింగ్ వేసేటప్పుడు ఇబ్బంది పడ్డారు. బోలాండ్ టీంలోకి రావడం ఆస్ట్రేలియా అదృష్టం. అతడు లేకుంటే భారత్ గెలిచేది’ అని చెప్పారు. కాగా హేజిల్‌వుడ్‌కు గాయం కావడంతో బోలాండ్ టీంలోకి వచ్చి 3 టెస్టుల్లో 21 వికెట్లు తీశారు.

News January 17, 2025

కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు.. లోకేశ్ ట్వీట్

image

AP: TDP సభ్యత్వాలు కోటి దాటినందుకు మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ’ అని ట్వీట్ చేశారు.

News January 17, 2025

సైఫ్ అలీఖాన్ గురించి తెలుసా?

image

సైఫ్ 1970లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ దంపతులకు జన్మించారు. పటౌడీ భారత క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించారు. సైఫ్ 1991లో నటి అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారే సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. సారా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. 2012లో సైఫ్ కరీనా కపూర్‌ను పెళ్లాడారు. వీరికి తైమూర్, జహంగీర్ జన్మించారు. సైఫ్ ఆస్తి సుమారు రూ.1,200 కోట్లు ఉంటుంది.