News January 16, 2025

KTR.. ‘గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నావ్: సామ

image

ఫార్ములా కేసులో KTR అవినీతి స్పష్టంగా కన్పిస్తోందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదేశాలతోనే ఫార్ములా-e వారికి HMDA (గ్రీన్ కో తరపున) డబ్బులు చెల్లించినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. నష్టాల వల్లే గ్రీన్ కో తప్పుకుందన్న KTR.. ఫార్ములా-eకి మొదటి సీజన్ డబ్బు కట్టలేదనే విషయం మాత్రం ఎందుకు దాచారని ప్రశ్నించారు. గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

Similar News

News February 11, 2025

ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు కోహ్లీనే: గేల్

image

ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీయేనని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డారు. రికార్డులే ఆ మాట చెబుతాయని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఇప్పటికీ విరాటే అత్యుత్తమ ఆటగాడు. ఆయన ఫామ్ కొంచెం డౌన్ అయిందంతే. తిరిగి పుంజుకుని కెరీర్‌ను బలంగా ముగిస్తారని అనుకుంటున్నా. ఇక రోహిత్ అద్భుతమైన ఎంటర్‌టైనర్. సిక్సుల్లో ఆయనే ఇప్పుడు కింగ్’ అని కొనియాడారు.

News February 11, 2025

రంగరాజన్‌పై దాడిని ఖండించిన చంద్రబాబు

image

AP: చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని హితవు పలికారు. గౌరవప్రదమైన చర్చలు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రంగరాజన్‌పై దాడిని టీజీ సీఎం రేవంత్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.

News February 11, 2025

డయాబెటిస్ ఉన్నా ఈ పండ్లు తినొచ్చు

image

తీపి పండ్లు తినాలని అనిపిస్తున్నా డయాబెటిస్ ఎక్కువవుతుందని మధుమేహులు భయపడుతుంటారు. రాస్ప్‌బెరీ, అవకాడో, ఆప్రికాట్, బ్లాక్‌బెరీ, పుచ్చకాయల్ని వారు తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇతర పండ్లతో పోలిస్తే వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందని, మేలు చేకూర్చే కొవ్వులు ఎక్కువ ఉంటాయని వివరిస్తున్నారు. అయితే మధుమేహులు తమ షుగర్ స్థాయుల్ని బట్టి వైద్యుల సూచన మేరకు డైట్ అనుసరించాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!