News November 20, 2024
కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు: రేవంత్

TG: లగచర్లలో కొందరిని ఉసిగొల్పి అధికారులపై దాడులు చేయించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు. రెచ్చగొట్టి, దాడులు చేసిన వాళ్లను శిక్షించొద్దా? పరిశ్రమలకు బీఆర్ఎస్ అడ్డుపడుతోంది. నేను అడిగింది లక్ష ఎకరాలు కాదు, వెయ్యి ఎకరాలే. గడ్డి కూడా మొలవని భూమిలో పరిశ్రమలు పెడతామంటే అడ్డుకుంటున్నారు’ అని వేములవాడ సభలో రేవంత్ మండిపడ్డారు.
Similar News
News January 18, 2026
చైనాలో నోరోవైరస్ కలకలం.. కొత్తదేనా?

చైనాలోని ఓ స్కూల్లో 100 మందికి పైగా విద్యార్థులు నోరోవైరస్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. 1968లోనే USలో బయటపడింది. భారత్లో కూడా గతంలో కేరళ, పుణే వంటి నగరాల్లో ఈ వైరస్ కలకలం రేపింది. ఆహారం, నీరు లేదా సోకిన వ్యక్తి ద్వారా ఇది వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాపాయం తక్కువే. అయినా తీవ్రమైన నీరసం, డీహైడ్రేషన్, డయేరియాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News January 18, 2026
ఆర్టీసీకి భారీ ఆదాయం.. 5 రోజుల్లో రూ.67కోట్లు

TG: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఛార్జీల ద్వారా రూ.67.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రోజుకి సగటున రూ.13.48కోట్లు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీ 6,431 స్పెషల్ బస్సులను నడపగా, రోజుకి అదనంగా రూ.2.70కోట్లు వీటి ద్వారానే సమకూరినట్లు చెప్పారు. ఇవాళ, రేపు కూడా స్పెషల్ బస్సులు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
News January 18, 2026
సూర్యుడి 7 గుర్రాల పేర్లు మీకు తెలుసా?

సూర్యరశ్మి7 రంగుల మిశ్రమమని సైన్స్ చెబుతోంది. సూర్యుడు 7 గుర్రాల రథంపై సంచరిస్తాడని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ 7 గుర్రాలు వేదాల్లోని 7 ప్రధాన ఛందస్సులకు ప్రతీకలు. అవి: గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. సూర్యకాంతిలోని 7 రంగులకు ఈ 7 గుర్రాల రూపాలు సరిపోతాయని ఆధ్యాత్మిక వేత్తలు భావిస్తారు. అంటే అటు సైన్స్ పరంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఈ సంఖ్యకు విడదీయలేని సంబంధం ఉంది.


