News November 20, 2024

కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు: రేవంత్

image

TG: లగచర్లలో కొందరిని ఉసిగొల్పి అధికారులపై దాడులు చేయించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు. రెచ్చగొట్టి, దాడులు చేసిన వాళ్లను శిక్షించొద్దా? పరిశ్రమలకు బీఆర్ఎస్ అడ్డుపడుతోంది. నేను అడిగింది లక్ష ఎకరాలు కాదు, వెయ్యి ఎకరాలే. గడ్డి కూడా మొలవని భూమిలో పరిశ్రమలు పెడతామంటే అడ్డుకుంటున్నారు’ అని వేములవాడ సభలో రేవంత్ మండిపడ్డారు.

Similar News

News April 18, 2026

IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

image

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.

News April 18, 2026

SRHలోకి సౌతాఫ్రికా పేసర్

image

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.

News April 18, 2026

హిట్ అండ్ రన్ కేసులో లొంగిపోయిన మాజీ MLA కొడుకు

image

TGలో 2022లో కలకలం రేపిన BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న రాహిల్ కోర్టు ఆదేశాలతో మూడేళ్ల తర్వాత తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2022 మార్చి 18న జూబ్లీహిల్స్‌లో రోడ్డు దాటుతున్న కొందరిని MLA స్టిక్కర్ ఉన్న కారు ఢీకొట్టింది. ఇందులో 2 నెలల బాలుడు చనిపోగా, ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్నారు.