News August 18, 2024
ఖర్గే, రాహుల్‌కు కేటీఆర్ లేఖ

TG: రైతులను కాంగ్రెస్ రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి మాజీ మంత్రి KTR లేఖ రాశారు. రుణమాఫీ మోసంతో లక్షలాది మంది రైతులు ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. కనీసం 40శాతం మందికి రుణమాఫీ చేయకుండానే 100% పూర్తయిందని ప్రకటించడం దౌర్భాగ్యమన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అన్నదాతల పక్షాన ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల తరఫున పోరాడుతామని హెచ్చరించారు.
Similar News
News November 8, 2025
పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో CII సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరుగుతుందని CM చంద్రబాబు చెప్పారు. పెట్టుబడుల సాధనకు మంత్రి లోకేశ్ తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. గడువులోపే క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో CM మాట్లాడుతూ ‘లోకేశ్ ఆదేశాలతో MLAల్లో కదలిక వచ్చి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం’ అని చెప్పారు.
News November 8, 2025
‘నీ భర్త అంకుల్లా ఉన్నాడు’ అని కామెంట్.. భార్య ఏం చేసిందంటే?

UP మీరట్‌కు చెందిన అంజలి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అంజలి, తన భర్త రాహుల్‌తో కలిసి ఇన్‌స్టా రీల్స్ చేసేది. ‘నువ్వు అందంగా ఉన్నావ్. నీ భర్తే అంకుల్లా ఉన్నాడు’ అని కామెంట్ రావడంతో అంజలి సహించలేకపోయింది. అదే గ్రామానికి చెందిన అజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియగానే ప్రియుడితో కలిసి అతడిని తుపాకీతో కాల్చి చంపింది. పోలీసులు అంజలి, అజయ్‌ను అరెస్టు చేశారు.
News November 8, 2025
ఐదో టీ20: భారత్ ఫస్ట్ బ్యాటింగ్

భారత్‌తో జరుగుతోన్న ఐదో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తిలక్‌కు రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు.
IND: అభిషేక్, గిల్, సూర్య(C), రింకూ సింగ్, జితేష్, సుందర్, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, డేవిడ్, ఫిలిప్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, బార్ట్లెట్, ఎల్లిస్, జంపా


