News October 31, 2024
మహారాష్ట్ర ఎన్నికల్లో BRS పోటీపై KTR స్పందన

మహారాష్ట్రలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRS పోటీ చేస్తుందా? అన్న ప్రశ్నకు #AskKTRలో KTR వివరించారు. ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు. అటు HYDలో నెలరోజులు 144 సెక్షన్ పెట్టడం షాకింగ్ అంశమని, రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ డిజాస్టర్ అని ఆయన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
Similar News
News December 29, 2025
మున్సిపల్ ఎన్నికలు.. JAN 10న ఓటరు జాబితా

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ షెడ్యూల్ విడుదల చేసింది. JAN 1న ముసాయిదా ఓటరు జాబితాలు ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. అదే నెల 10న తుది ఓటరు జాబితాను విడుదల చేయాలని పేర్కొంది. కాగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
News December 29, 2025
పుతిన్ ఇంటిపై దాడికి ఉక్రెయిన్ యత్నం: రష్యా

అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందని రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ‘91 లాంగ్ రేంజ్ డ్రోన్స్‌తో మా ప్రెసిడెంట్ ఇంటిపై ఉక్రెయిన్ నిన్న, ఇవాళ దాడికి ప్రయత్నించింది. వాటిని మా రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. ఇలాంటి చర్యలకు తప్పక సమాధానం చెప్పి తీరుతాం’ అని ఆయన హెచ్చరించారు. అయితే ఆ టైమ్‌లో పుతిన్ ఇంట్లో ఉన్నారా లేదా అనే దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.
News December 29, 2025
మరోసారి ‘ఇండిగో’ విమానాల రద్దు

దేశవ్యాప్తంగా ఇవాళ 118 విమానాలను రద్దు చేసినట్లు ‘ఇండిగో’ తెలిపింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. వీటిలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలున్నాయి. కాగా ఇటీవల ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డ విషయం తెలిసిందే.


