News September 22, 2024
కేటీఆర్‌వి నిరాధార ఆరోపణలు: మంత్రి కోమటిరెడ్డి
TG: రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉందా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో లేదో తెలియడం లేదన్నారు. అమృత్ టెండర్లపై <<14158364>>కేటీఆర్<<>> నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.8,888 కోట్ల అక్రమాలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, అందుకే KTR ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Similar News
News October 10, 2024
సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించం: మంత్రి కొల్లు
ఏపీలో మద్యం షాపులను సొంతం చేసుకోవడానికి కొందరు సిండికేట్లుగా ఏర్పడుతున్నారనే ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వొద్దని, రాజకీయ ఒత్తిళ్లు తలొగ్గొద్దని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ, షాపుల కేటాయింపులు పారదర్శకంగా ఉండాలన్నారు. సిండికేట్లకు సహకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నెల 16నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.
News October 10, 2024
టాటా కార్లు.. ప్రయాణికుల భద్రతే ప్రధానం
ఎన్నో రంగాలకు విస్తరించినా ‘టాటా’ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కార్లే. టాటా ఇండికా మొదలుకొని, నానో వరకు ఎన్నో మోడళ్లను తీసుకొచ్చిన ఘనత ఆ కంపెనీది. అందులో రతన్ టాటా కృషి ఎనలేనిది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు టాటా అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇండియాలో మొట్టమొదటి 5/5 రేటింగ్ సాధించిన కారు టాటా నెక్సాన్. దీని సృష్టికర్త రతన్ టాటానే.
News October 10, 2024
టాటా మరణంపై మమత ట్వీట్: మొసలి కన్నీరు వద్దన్న నెటిజన్స్
రతన్ టాటా మరణం భారత వ్యాపార రంగానికి తీరని లోటన్న బెంగాల్ CM మమతా బెనర్జీ ట్వీటుపై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. సింగూరులో టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నానో’ను అడ్డుకొని ఇప్పుడు మొసలి కన్నీరు ఎందుకంటూ నిలదీస్తున్నారు. ‘మీ వల్ల టాటాకు చాలా నష్టమొచ్చింది. ఇక చాలు’, ‘సింగూరు నుంచి టాటా వెళ్లిపోయినప్పుడే నువ్వు ఓడిపోయావ్’, ‘మీ రాజకీయ వృద్ధి కోసం సింగూరు అభివృద్ధిని అడ్డుకున్నారు’ అని కామెంట్స్ పెడుతున్నారు.