News April 29, 2024
కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసలు
KKRతో మ్యాచ్‌లో ఢిల్లీ భీకర బ్యాటర్లంతా విఫలమైన వేళ.. బౌలర్ కుల్దీప్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 111కే 8 వికెట్లు కోల్పోయినప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి జట్టును నిలబెట్టారు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35* పరుగులతో టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. అత్యధిక ఫోర్లూ ఇతనివే కావడం గమనార్హం. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు కుల్దీప్‌ను చూసి నేర్చుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు.
Similar News
News November 2, 2024
BRS పదేళ్లలో చేయని అభివృద్ధిని 10 నెలల్లో చేశాం: శ్రీధర్
TG: గత ప్రభుత్వం పేదలకు కాకుండా తమ బంధువులకు, కార్యకర్తలకు గృహాలు మంజూరు చేసిందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తాము పేదలందరికీ ఇళ్లు ఇస్తామని, ఇప్పటికే అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ₹10L వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 50వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. పదేళ్లలో BRS చేయలేని అభివృద్ధిని తాము 10 నెలల్లోనే చేశామని తెలిపారు.
News November 2, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: నవంబర్ 2, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:15 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 2, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.