News December 3, 2024
ఇండియా కూటమి కుర్చీ కోసం కుమ్ములాట!

అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ డీలాపడడంతో INDIA కూటమి సారథ్య బాధ్యతలపై మిత్రపక్షాలు కన్నేశాయి! బెంగాల్ CM మమతా బెనర్జీ ఈ జాబితాలో ముందున్నారు. కూటమిని నడిపించగల సామర్థ్యం ఆమెకుందని TMC నేతలు వాదిస్తున్నారు. BJPని ఓడించే విషయంలో కాంగ్రెస్ కంటే ఘనమైన రికార్డు ఆమె సొంతమని చెబుతున్నారు. అయితే కూటమికి మమతా సారథ్యం ప్రతిపాదన ఓ పెద్ద జోక్ అని కాంగ్రెస్ కొట్టిపారేసింది.
Similar News
News November 12, 2025
ఐరన్, క్యాల్షియం ట్యాబ్లెట్లు ఎలా తీసుకోవాలంటే?

హిమోగ్లోబిన్ తయారీలో ఐరన్, ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం అత్యవసరం. అందుకే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, నెలసరి నిలిచిన మహిళలు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అయితే ఈ రెండిటినీ ఒకేసారి తీసుకుంటే శరీరం ఐరన్ను గ్రహించుకోకుండా క్యాల్షియం అడ్డుపడుతుంది. ఐరన్ పరగడుపున బాగా ఒంట పడుతుంది కాబట్టి భోజనానికి ముందు తీసుకుంటే మంచిది. క్యాల్షియాన్ని భోజనంతో పాటు తీసుకోవచ్చు.
News November 12, 2025
వారితో మాకు సంబంధం లేదు: అల్ ఫలాహ్ యూనివర్సిటీ

ఢిల్లీ <<18265346>>ఎర్రకోట <<>>వద్ద పేలుడు కేసులో ప్రధాన నిందితులు అల్ ఫలాహ్ వర్సిటీ డాక్టర్లేనని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వర్సిటీ VC భూపిందర్ కౌర్ తెలిపారు. డాక్టర్లు ముజామిల్, షాహీన్తో తమకు సంబంధం లేదన్నారు. ‘మేం ఎలాంటి రసాయనాలు నిల్వ చేయట్లేదు. ఉపయోగించట్లేదు. స్టూడెంట్ల అకడమిక్, ట్రైనింగ్ కోసం అవసరమైనంత వాడుతున్నాం’ అని పేర్కొన్నారు.
News November 12, 2025
ప్లాన్ చేసి ప్రిపేర్ అయితే.. ప్రభుత్వ ఉద్యోగం పక్కా

ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే రాత, ఫిజికల్, మెడికల్ టెస్టుల్లో పాస్ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. సమయపాలన ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మాక్ టెస్టులు ఎక్కువగా రాయాలి. పోలీస్, ఆర్మీ, బీఎస్ఎఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్పై శ్రద్ధపెట్టాలి.


