News December 3, 2024
ఇండియా కూటమి కుర్చీ కోసం కుమ్ములాట!

అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ డీలాపడడంతో INDIA కూటమి సారథ్య బాధ్యతలపై మిత్రపక్షాలు కన్నేశాయి! బెంగాల్ CM మమతా బెనర్జీ ఈ జాబితాలో ముందున్నారు. కూటమిని నడిపించగల సామర్థ్యం ఆమెకుందని TMC నేతలు వాదిస్తున్నారు. BJPని ఓడించే విషయంలో కాంగ్రెస్ కంటే ఘనమైన రికార్డు ఆమె సొంతమని చెబుతున్నారు. అయితే కూటమికి మమతా సారథ్యం ప్రతిపాదన ఓ పెద్ద జోక్ అని కాంగ్రెస్ కొట్టిపారేసింది.
Similar News
News January 19, 2026
స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టండిలా!

డెలివరీ అయిన తర్వాత చాలామంది మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. వీటిని ఎలా తొలగించుకోవాలంటే.. * ఆముదం నూనెను స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, 15నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత హీటింగ్ ప్యాడ్‌ను ఆ మార్క్స్‌పై 10 నిమిషాలు ఉంచాలి. ఇలా నెలరోజులు చెయ్యాలి. * కలబంద గుజ్జును స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, మూడు గంటల పాటు వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేయాలి.
News January 19, 2026
అమరావతికి స్వయం ప్రతిపత్తి దిశగా అడుగులు

AP: అమరావతికి స్వయంప్రతిపత్తి కల్పించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. తొలిసారిగా ప్రపంచబ్యాంకు, ADB రూల్స్‌కు అనుగుణమైన రీతిలో పాలనా వ్యవహారాలు సాగేలా ఇవి ఉండనున్నాయి. ఆర్థిక అవసరాలు తీరేలా భూములు అమ్ముకొనే వీలు కల్పించనున్నారు. వనరులను మదింపుచేసి స్థిరమైన రాబడి కోసం పెట్టుబడులు వచ్చేలా ఫ్రేమ్‌వర్కును ఏర్పరుస్తారు. పాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటుచేస్తారు. ప్రస్తుత MNP చట్టాలనూ మారుస్తారు.
News January 19, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <


