News December 21, 2024
మినీ ఇండియాలా కువైట్: ప్రధాని మోదీ
కువైట్‌ను చూస్తోంటే మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశంలో ఇంతమంది భారతీయులను చూడటం సంతోషంగా ఉందని చెప్పారు. ‘కువైట్ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించే చెబుతుంటారు. విదేశీ కరెన్సీ ఆర్జనలో భారత్ టాప్‌లో ఉంది. మీరంతా కష్టపడటం వల్లే ఇది సాధ్యమైంది. భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలే కాదు.. విడదీయలేని మైత్రి కూడా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 19, 2025
TGలో కాపిటా ల్యాండ్ ₹450 కోట్ల పెట్టుబడులు!
TG: సింగపూర్‌లో పర్యటిస్తున్న CM రేవంత్ బృందం మరో భారీ పెట్టుబడిని రాబట్టినట్లు CMO వెల్లడించింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్కు ఏర్పాటుకు ₹450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కాపిటా ల్యాండ్ సంస్థ ముందుకొచ్చిందని పేర్కొంది. దీని వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. నిన్న STT గ్లోబల్ డేటా సెంటర్ ₹3,500 కోట్ల పెట్టుబడితో ఆర్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో MOU చేసుకుంది.
News January 19, 2025
20న ట్రంప్ ప్రమాణం.. 21న అరెస్టులు!
డొనాల్డ్ ట్రంప్ ఈనెల 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను మూకుమ్మడిగా అరెస్టు చేయిస్తారని వార్తలు వస్తున్నాయి. అలాంటి వారిపై ఆయన ఉక్కుపాదం మోపుతారని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై అమెరికా వలసల విభాగం మాజీ అధికారి ఒకరు స్పందిస్తూ ట్రంప్ ప్రమాణం చేశాక 21నుంచే ఈ అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్రమంగా చొరబడ్డ వలసదారులను వెనక్కి పంపే చర్యలను ముమ్మరం చేస్తారన్నారు.
News January 19, 2025
బుల్లిరాజు పాత్రకు మహేశ్‌బాబు ఫిదా!
ప.గో జిల్లా భీమవరానికి చెందిన బుల్లిరాజు క్యారెక్టర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ పాత్రకు ముగ్ధులైనట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సినిమా చూశాక మహేశ్ సార్‌ను టీమ్‌తో కలిశాను. చాలా బాగా చేశావు బుల్లిరాజు. నీ కోసమైనా మళ్లీ సినిమా చూస్తానన్నారు. నాతో పాటు డాన్స్ కూడా చేశారు’ అని చెప్పుకొచ్చారు.