News April 24, 2024
కేవీల్లో ప్రవేశాలు.. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండిలా

కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. అధికారులు లాటరీ నిర్వహించి విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచారు. లాగిన్ కోడ్‌తో ఎంటర్ అయి లాటరీ నంబర్‌తో పాటు స్కూళ్ల వారీగా వెయిటింగ్ లిస్టును తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్: https://kvsonlineadmission.kvs.gov.in/
Similar News
News December 16, 2025
453 Asst Prof పోస్టుల భర్తీ కోసం సీఎంకు ఫైల్

TG: వర్సిటీల్లోని 453 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఫైలును CM రేవంత్‌కు పంపింది. 12 వర్సిటీల్లో 1061 పోస్టులు ఖాళీ ఉండగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో కొన్ని భర్తీ అయ్యాయి. వాటిని మినహాయించి మిగతా ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు నివేదించారు. సీఎం ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. కాగా ఎక్కువ ఖాళీలు OUలోనే ఉన్నాయి.
News December 16, 2025
విధ్వంసక ప్లేయర్.. రూ.కోటికే ముంబైకి

సూపర్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.కోటి బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఇతడు గతంలోనూ ముంబై తరఫున ఆడారు. మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో, బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.
News December 16, 2025
TRAIలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<


