News December 20, 2024
మహిళలపై ‘మంత్రగత్తె’ ముద్ర రాజ్యాంగానికే మచ్చ: సుప్రీం కోర్టు
మంత్రగత్తెల పేరిట మహిళలపై దాడులు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి మచ్చ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మంత్రగత్తెల నెపంతో ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి దాడి చేసిన కేసులో బిహార్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టేను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. మహిళల ప్రాథమిక హక్కులు, గౌరవానికి దాడులతో భంగం వాటిల్లుతోందని, వృద్ధ, వితంతు మహిళలపై దాడులు చేసేందుకు నెపాన్ని వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
Similar News
News January 14, 2025
ఆస్కార్స్ 2025: నామినేషన్స్ ప్రకటన వాయిదా
లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆస్కార్స్-2025 నామినేషన్స్ ప్రకటన వాయిదా పడింది. ఓటింగ్ పీరియడ్‌ను పొడిగించారు. ఈనెల 17న నామినేషన్స్‌ను వెల్లడించాల్సి ఉండగా, 23వ తేదీకి వాయిదా వేశారు. ఆరోజున వర్చువల్‌గా నామినీల లిస్టును ప్రకటించనున్నారు. మార్చి 2న అవార్డులను ప్రకటిస్తారు.
News January 14, 2025
రూపాయి పతనం కొంత కాలమే: SBI రిపోర్ట్
భారత రూపాయి పతనంపై ట్రంప్ ప్రభావం కొంత కాలమే ఉంటుందని SBI రిపోర్ట్ పేర్కొంది. ఆయన ప్రెసిడెన్సీ ఆరంభంలో మన కరెన్సీకి ఒడుదొడుకులు ఎదురైనా త్వరలోనే స్థిరత్వం సాధిస్తుందని అంచనా వేసింది. చరిత్రను పరిశీలిస్తే డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ల హయాంలోనే INR మెరుగ్గా రాణించిందని 2013 నాటి ‘టేపర్ తంత్రం’ను గుర్తుచేసింది. NOV నుంచి రూపాయి 3% బలహీనపడినా ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇది అతి కనిష్ఠమని తెలిపింది.
News January 14, 2025
పండగ రోజు ఏ సినిమాకు వెళ్తున్నారు?
సంక్రాంతి పండగ రోజూ అందరూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటారు. ఫ్యామిలీతో సినిమాలకు వెళ్తుంటారు. ఈ సారి సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలు ‘గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలోకి వచ్చేశాయి. ఏ సినిమా ఎలా ఉందో టాక్ కూడా తెలిసిపోయింది. మరి మీరు ఈరోజు వీటిలో ఏ మూవీకి వెళ్తున్నారు? కామెంట్ చేయండి.