News September 30, 2024

లడ్డూ వివాదం.. SC వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందన

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇవాళ ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి’ అన్న వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు. SC స్టేట్‌మెంట్‌ను పోస్ట్ చేశారు. కాగా లడ్డూ వివాదాన్ని పెద్దది చేయకుండా దర్యాప్తు చేయాలని ఇటీవల ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.

Similar News

News October 9, 2024

ఏపీకి బుల్లెట్ ట్రైన్.. ఎంపీలతో చంద్రబాబు

image

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఏపీని కూడా రైల్వే శాఖ భాగం చేసిందని కూటమి ఎంపీలకు CM చంద్రబాబు తెలిపారు. తొలి దశలో దక్షిణాదిలో చెన్నై, బెంగళూరు మీదుగా మైసూరు, ముంబై నుంచి HYD వరకు ట్రైన్‌లను ప్రతిపాదించారు. తాజాగా బెంగళూరు, చెన్నై, HYD, అమరావతి నగరాలను కలిపేలా ప్రతిపాదనలు తయారవుతున్నాయని బాబు వెల్లడించారు. నివేదిక సిద్ధం అయ్యాక రైల్వే శాఖ వివరాలు వెల్లడిస్తుందన్నారు.

News October 9, 2024

బ్యాటరీ పర్సంటేజ్‌తో ఈసీకి కాంగ్రెస్ అభ్యర్థుల ఫిర్యాదు

image

హరియాణాలోని మహేంద్రగఢ్, పానిపట్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఈవీఎం బ్యాటరీల పర్సంటేజ్‌తో ఈసీకి ఫిర్యాదు చేశారు. EVMలలో 99% బ్యాటరీ ఉన్నచోట BJP, 60-70% ఉన్నచోట కాంగ్రెస్ లీడ్‌లో ఉందని, కుట్ర జరిగిందని ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ‘EVMలలో ఆల్కలీన్ బ్యాటరీలు వాడుతున్నాం. ఇది వోల్టేజీని బట్టి పర్సంటేజ్ తక్కువగా చూపిస్తుంది. ఫలితాలకు బ్యాటరీకి సంబంధం లేదు’ అని పేర్కొంది.

News October 9, 2024

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఇలా చేయండి

image

రోజంతా చురుగ్గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉత్సాహంగా ఉండాలంటే మానసిక, శారీర ఆరోగ్యం బాగుండాలి. అందుకోసం ప్రతిరోజు కాసేపు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. టిఫిన్ స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి. సమయానికి నిద్రపోవాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.