News December 20, 2024

నేడు జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల

image

TG: లగచర్ల దాడి కేసులో అరెస్టయి సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న రైతులు ఇవాళ విడుదల కానున్నారు. రెండు రోజుల క్రితం వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. గురువారమే వారు రిలీజ్ కావాల్సి ఉండగా, సాయంత్రం 6 గంటలలోగా బెయిల్‌కు సంబంధించిన పత్రాలు సిద్ధం కాకపోవడంతో విడుదల చేయలేదు. దీంతో నేడు ఉదయం రిలీజ్ చేయనున్నారు.

Similar News

News January 18, 2025

రంజీ మ్యాచులకు కోహ్లీ, రాహుల్ దూరం!

image

ఈనెల 23 నుంచి జరిగే రంజీ ట్రోఫీ మ్యాచులకు కోహ్లీ, KL రాహుల్ దూరం కానున్నట్లు ESPN CRIC INFO తెలిపింది. మెడ గాయంతో కోహ్లీ, మోచేతి గాయంతో రాహుల్ బాధపడుతున్నారని పేర్కొంది. ఈనెల 30 నుంచి జరగనున్న మ్యాచులకు వీరిద్దరూ అందుబాటులో ఉండే అవకాశమున్నా, ఆ వెంటనే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఉండటంతో వారు రంజీల్లో ఆడే అవకాశం లేదని తెలిపింది.

News January 18, 2025

అన్నకు సవాల్ విసిరిన మంచు మనోజ్

image

మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. నిన్న కుక్క-సింహం అంటూ ట్వీట్స్ చేసుకున్న ఈ అన్నదమ్ములు.. సై అంటే సై అంటూ ఈరోజు మనోజ్ సవాల్ విసిరారు. ‘దా.. కూర్చుని మాట్లాడుదాం. మహిళలు, నాన్న, స్టాఫ్‌ను పక్కన పెట్టి మనం కలుసుకుందాం. ఒట్టేసి చెబుతున్నా.. నేనొక్కడినే వస్తా. నువ్వు ఎవరినైనా, ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్తీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం’ అని ట్వీట్ చేశారు.

News January 18, 2025

గ్రూప్-2 కీ విడుదల

image

TG: గ్రూప్-2 ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 సా.5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో 783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 నిర్వహించారు. సైట్: <>https://websitenew.tspsc.gov.in/<<>>