News November 19, 2024

రాష్ట్రపతి దృష్టికి లగచర్ల ఘటన

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల వ్యవహారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు చేరింది. ఆమె అపాయింట్‌మెంట్ కోసం లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు ఢిల్లీలో వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి భూసేకరణకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ, మహిళా, జాతీయ మానవహక్కుల కమిషన్‌లను కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు.

Similar News

News March 10, 2026

రాత్రి మంచి నిద్ర కోసం..

image

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It

News March 10, 2026

యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

image

ఇరాన్ యుద్ధం సెగ పాక్‌కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.

News March 9, 2026

నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు: సంజూ తండ్రి

image

భారత్ ప్రపంచకప్ గెలవడం ఆనందంగా, గర్వంగా ఉందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ తెలిపారు. ‘సంజూ కోసం దేశంలో చాలా మంది ప్రార్థించారు. ఇప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు. సెమీఫైనల్లో 250 రన్స్ చేసినా మనం 6-7 రన్స్ తేడాతోనే గెలిచాం. నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు. దాని కోసం 1-2 బాల్స్ కూడా మిస్ చేయకూడదు’ అని చెప్పారు.