News November 13, 2024

లగచర్ల ఘటన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

image

TG: వికారాబాద్ లగచర్ల ఘటనకు సంబంధించి పోలీస్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. A-1గా భోగమోని సురేశ్ పేరు చేర్చారు. అధికారులపై హత్యాయత్నం జరిగిందని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని పేర్కొన్నారు. ముందుగానే కారం, రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు.

Similar News

News December 9, 2024

నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

image

TG: ములుగు జిల్లా చల్పాక <<14757563>>ఎన్‌కౌంటర్‌<<>>కు నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఆహారంలో విష ప్రయోగం చేసి కాల్చి చంపారని వారు ఆరోపించారు. మావోల బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విద్యాలయాలు, వ్యాపార సంస్థలు బంద్‌ను పాటించాలని మావోయిస్టులు కోరుతూ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.

News December 9, 2024

అందుబాటులోకి ‘మీ సేవ’ మొబైల్ యాప్‌

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ సేవ’ మొబైల్ యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందవచ్చు. కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. ఈ యాప్‌తో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే టీ ఫైబర్ నెట్ సేవలనూ ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అమలు చేయనుంది.

News December 9, 2024

మంగళ, శనివారాల్లో సాగర్- శ్రీశైలం లాంచీలు

image

నాగార్జున‌సాగర్ నుంచి శ్రీశైలానికి ఇకపై వారానికి 2 రోజులు లాంచీలు నడవనున్నాయి. ఈ ఏడాది నవంబరులో లాంచీ ట్రిప్పులను ప్రారంభించి, వారానికి ఒక లాంచీ చొప్పున 800మందిని శ్రీశైలం తీసుకెళ్లినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఇక నుంచి మంగళ, శనివారాల్లో లాంచీలు నడుపుతామని పేర్కొంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలు(12ఏళ్ల లోపు) రూ.1600, 2వైపులా రూ.3,000..రూ.2వేలుగా నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.