News November 17, 2024
లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే మూసీ నిద్ర: కేటీఆర్

TG: రేవంత్ రెడ్డికి కమలదళం రక్షణ కవచంగా మారిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే ఈ మూసీ నిద్ర అని దుయ్యబట్టారు. హైడ్రాను మొదట స్వాగతించిన కిషన్ రెడ్డికి ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా? అని Xలో ప్రశ్నించారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనుక మతలబేంటని, ఈ పాలి‘ట్రిక్స్’ను తెలంగాణ గమనిస్తోందని రాసుకొచ్చారు.
Similar News
News November 18, 2025
లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎంకు సమన్లు

మైనర్పై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ CM, BJP నేత BS యడియూరప్పకు ఫాస్ట్రాక్ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది FEBలో మీటింగ్ కోసం ఆయన నివాసానికి వెళ్లిన తన 17 ఏళ్ల కూతురిని యడియూరప్పతో పాటు మరో ముగ్గురు లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోక్సో కేసు నమోదైంది. ఈక్రమంలోనే యడియూరప్ప సహా నలుగురు DEC 2లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ కోర్టు సమన్లు ఇచ్చింది.
News November 18, 2025
గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.
News November 18, 2025
రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్లైన్లో <


