News November 17, 2024

లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే మూసీ నిద్ర: కేటీఆర్

image

TG: రేవంత్ రెడ్డికి కమలదళం రక్షణ కవచంగా మారిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే ఈ మూసీ నిద్ర అని దుయ్యబట్టారు. హైడ్రాను మొదట స్వాగతించిన కిషన్ రెడ్డికి ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా? అని Xలో ప్రశ్నించారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనుక మతలబేంటని, ఈ పాలి‘ట్రిక్స్’‌ను తెలంగాణ గమనిస్తోందని రాసుకొచ్చారు.

Similar News

News December 7, 2024

అర్ధరాత్రి వరకు నిద్ర పోవట్లేదా?

image

రాత్రి సమయంలో లేటుగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది. త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది. అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని అధ్యయనాల్లో తేలింది.

News December 7, 2024

ఈనెల 15న WPL మినీ వేలం

image

బెంగళూరులో ఈనెల 15న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మినీ వేలం నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది. మొత్తం 120 మంది ప్లేయర్లు ఆక్షన్‌లో పాల్గొంటున్నారని, అందులో 29 మంది విదేశీ ప్లేయర్లున్నారని తెలిపింది. స్వదేశీ క్రికెటర్ల కోసం 19 స్లాట్లు, ఓవర్సీస్ ప్లేయర్లకు 5 స్లాట్లు కేటాయించినట్లు పేర్కొంది. WPLలో మొత్తం 5 జట్లు (ఢిల్లీ, గుజరాత్, ముంబై, బెంగళూరు, యూపీ) పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

News December 7, 2024

బ్రిక్స్ కరెన్సీపై ప్రతిపాదనలు లేవు: జైశంకర్

image

US డాల‌ర్‌తో పోటీ ప‌డేందుకు బ్రిక్స్ దేశాల‌ కొత్త క‌రెన్సీ తెచ్చే విష‌య‌మై నిర్ణ‌యం తీసుకోలేద‌ని విదేశాంగ మంత్రి జైశంక‌ర్ స్ప‌ష్టం చేశారు. $ విలువ‌ తగ్గింపుపై భారత్‌కు ఆస‌క్తి లేద‌ని తేల్చిచెప్పారు. భార‌త్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగ‌స్వామి అని, బ్రిక్స్ కరెన్సీపై ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు లేవ‌న్నారు. కాగా బ్రిక్స్ దేశాలు కొత్త క‌రెన్సీ తెస్తే 100% టారిఫ్‌లు విధిస్తామ‌ని ట్రంప్ గతంలో హెచ్చరించారు.