News December 14, 2024

లక్ష్మీపార్వతికి వైసీపీ కీలక బాధ్యతలు

image

AP: నందమూరి లక్ష్మీ పార్వతికి వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ చీఫ్ జగన్ ఆదేశాలతో ఆమెను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News November 22, 2025

JGTL: రోడ్లపై ధాన్యం రాశులు వద్దు.. ఇలా చేస్తే ముద్దు..!

image

రోడ్లపై రైతులు పోస్తున్న ధాన్యంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న దాన్ని గుర్తించిన JGTL VDC సభ్యులు ఇటీవల తమ ఆధ్వర్యంలో దుబ్బగట్టు ప్రాంతాన్ని చదును చేశారు. మల్లాపూర్(M) కేంద్రంలో రైతులు ధాన్యం పోసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దారు. JCBలతో ఫ్లాట్‌ చేయించారు. వీరికి పార్టీల నేతల సహకారం అందింది. రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై పోయొద్దని ఈ సందర్భంగా వారు కోరారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇలానే చేయాలని ఆకాంక్షించారు.

News November 22, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.