News December 14, 2024
లక్ష్మీపార్వతికి వైసీపీ కీలక బాధ్యతలు
AP: నందమూరి లక్ష్మీ పార్వతికి వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ చీఫ్ జగన్ ఆదేశాలతో ఆమెను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News January 20, 2025
JEE మెయిన్స్ రాస్తున్నారా? ఇవి తెలుసుకోండి!
జనవరి 22 నుంచి 30 వరకు JEE మెయిన్స్ జరగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు అధికారుల సూచనలు:
– అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం తప్పనిసరి
– ఐడెంటిటీ కార్డు, అన్లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఫొటో. బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలి
– పెన్సిల్స్, నగలు, ఫోన్, వాటర్ బాటిల్, పర్సులకు నో ఎంట్రీ
– పరీక్ష సమయానికి 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలి.
– ఉ.9-12 గం., మ.3-6 గం. మధ్య 2 షిప్టుల్లో జరగనుంది
News January 20, 2025
MLC కవిత ఫొటోల మార్ఫింగ్.. పోలీసులకు ఫిర్యాదు
TG: MLC కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి Xలో పోస్ట్ చేసిన హ్యాండిల్స్‌తో పాటు దీని వెనక ఉన్న వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. ఒక రాజకీయ పార్టీకి చెందిన కీలక నాయకుడి ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఫొటో మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపించింది.
News January 20, 2025
ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న రింకూ సింగ్
భారత యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ పెళ్లికి ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య జరిగిన చర్చల తర్వాత ఇద్దరి పెళ్లికి తాము ఒప్పుకున్నట్లు ఆయన PTIకి వెల్లడించారు. ‘రింకూ, ప్రియా ఒకరికొకరు ఏడాదిన్నరగా తెలుసు. వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాలు తాజాగా అంగీకారానికి వచ్చాయి. నిశ్చితార్థం& పెళ్లి తేదీలు పార్లమెంట్ సమావేశాల తర్వాత నిర్ణయిస్తాం’ అని తుఫానీ పేర్కొన్నారు.