News September 21, 2024
‘లాల్బాగ్చా రాజా’కు రూ. కోట్లాది కానుకలు

ముంబైలోని ‘లాల్బాగ్చా రాజా’ వినాయకుడిని నగరంలో అత్యంత ఘనంగా కొలుస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గణేశ్ చతుర్థికి భక్తులు ఆయనకు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. మొత్తం రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64 కిలోల వెండి స్వామివారికి సమకూరాయని ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ స్వామి నిమజ్జన వేడుకలో అంబానీలు సహా వేలాదిమంది భక్తులు పాల్గొనడం విశేషం.
Similar News
News November 19, 2025
NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.
News November 19, 2025
బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.
News November 19, 2025
గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.


