News March 8, 2025

వనువాటు పౌరసత్వం తీసుకున్న లలిత్ మోదీ.. ప్రత్యేకతలివే!

image

గత కొన్నేళ్లుగా UKలో ఉంటున్న IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ‘వనువాటు’ దేశ పౌరసత్వం తీసుకున్నారు. 80 ద్వీపాల సమూహమైన ఈ దేశం పసిఫిక్ seaలో ఉంటుంది. అక్కడ IT సహా ఇతర ట్యాక్స్‌లు ఉండవు. క్రిప్టో హబ్‌గా ఈ కంట్రీ వృద్ధి చెందుతోంది. 2024 హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో తొలి ప్లేస్‌లో నిలిచింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్, INDలో దర్యాప్తును తప్పించుకునేందుకే ఈ పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 16, 2025

ఫ్రాంచైజీ క్రికెట్ రారాజు ముంబై

image

ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ముంబై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. 2011 CLT20 టైటిల్‌తో మొదలైన కప్పుల వేట నిరంతరాయంగా కొనసాగుతోంది. IPLలో 5టైటిళ్లు గెలుచుకొని చెన్నైతో పాటు టాప్ ప్లేస్‌లో ఉంది. నిన్నజరిగిన WPL ఫైనల్‌లోనూ విజయం సాధించింది. మెుత్తంగా అన్ని క్రికెట్ లీగ్‌లలో కలిపి 12 టైటిళ్లు గెలిచింది. ఈ విజయాలతో ఫ్రాంచైజీ క్రికెట్‌లో నంబర్‌వన్ జట్టుగా సత్తా చాటుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.

News March 16, 2025

రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

image

TG: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. OBMMS ఆన్‌లైన్ పోర్టల్‌‌లో ఏప్రిల్‌ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద SC, ST, BCలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ₹3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60%-80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి ₹6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. వివరాలకు http//tgobmms.cgg.gov.in/ సంప్రదించండి.

News March 16, 2025

ట్విటర్లో గ్రోక్ హల్‌చల్.. మీమ్స్ వైరల్

image

ట్విటర్ తీసుకొచ్చిన గ్రోక్ AI గురించి నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. నిజమైన మనిషి తెలుగును ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే ఎలా ఉంటుందో అదే తరహాలో భాషలో ఎటువంటి తప్పులూ లేకుండా గ్రోక్ జవాబులిస్తోంది. ఆఖరికి బూతులు కూడా నేర్చుకుని, తిట్టిన వారిని తిరిగి తిడుతుండటంతో ట్విటర్ జనాలు జోకులు పేలుస్తున్నారు. ఫ్యాన్ వార్స్‌లోనూ గ్రోక్‌ను ఇన్వాల్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా భాషల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.

error: Content is protected !!