News October 5, 2025

లలిత సహస్ర నామాలు – వివరములు (2)

image

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ||
ఉద్యద్భాను సహస్రాభా: వేల సూర్యుల కాంతితో సమానమైన తేజస్సు గల మాతా!
చతుర్బాహు సమన్వితా: నాలుగు చేతులు కలిగి ఉన్న తల్లి!
రాగస్వరూప పాశాఢ్యా: అనురాగం అనే రూపంలో ఉన్న పాశాన్ని ధరించి ప్రకాశించే దేవి!
క్రోధాకారాంకుశోజ్జ్వలా: కోపమునకు ప్రతీకైన అంకుశమనే ఆయుధంలా ప్రకాశిస్తున్న దేవత!
<<-se>>#LSN<<>>

Similar News

News October 5, 2025

‘జ్యోతిష శాస్త్రం’ ఏం చెబుతోందంటే?

image

ప్రతి జీవికీ కష్టసుఖాలు, జయాపజయాలు కర్మఫలితాలను బట్టే కలుగుతాయి. ఈ కర్మ ఫలాల విశ్లేషణకై, మనిషి జీవిత గమనాన్ని తెలుసుకోవడానికై, మన రుషీశ్వరులు ప్రసాదించిన దివ్యజ్ఞానమే జ్యోతిషశాస్త్రము. ఇది కేవలం జాతక ప్రభావాన్ని వివరించడమే కాక పూర్వ జన్మల పాపపుణ్య కర్మల రహస్యాన్ని వెల్లడిస్తుంది. మానవుడు తన జీవితాన్ని సరైన ధర్మమార్గంలో నడుపుకోవడానికి ఈ శాస్త్రం ఓ అమూల్యమైన సాధనమని పండితుల అభిప్రాయము. <<-se>>#doshaalu<<>>

News October 5, 2025

తెలంగాణలో కోల్డ్రిఫ్ సిరప్‌పై నిషేధం

image

TG: రాష్ట్రంలో కోల్డ్రిఫ్ <<17918452>>దగ్గు మందు<<>>సిరప్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వల్ల 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దగ్గు మందులో 42% విష రసాయనం(DEG) ఉన్నట్లు తేలింది. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు దీన్ని బ్యాన్ చేశాయి.

News October 5, 2025

భారత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్

image

మహిళల క్రికెట్ WCలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇండియా: ప్రతికా, స్మృతి మంధాన, హర్లిన్, హర్మన్(C), రోడ్రిగ్స్, దీప్తీ శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, రేణుక, క్రాంతి, శ్రీ చరణి
పాక్: మునీబా, సాదక్, సిద్రా అమిన్, రమీన్, అలియా, నవాజ్, ఫాతిమా(C), నటాలియా, డయానా, నష్రా, సదియా