News April 14, 2025

రాజధాని కోసం మరోసారి భూ సమీకరణ?

image

AP: రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని కోసం మరో 30 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. గతంలోనే 29 గ్రామాల్లోని 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించింది. ఇప్పుడు తూళ్లురు, అమరావతి, తాడికొండ, మంగళగిరిలో ఈ భూ సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News April 15, 2025

వివేకా హత్య కేసు.. నిందితుడు ఉదయ్‌కి సుప్రీం నోటీసులు

image

AP: వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ బెయిల్ రద్దు చేయాలంటూ YS సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో ఉదయ్ పాత్ర ఏమిటని CJI ధర్మాసనం ప్రశ్నించింది. హత్య జరిగాక గాయాలు కనపడకుండా కట్లు కట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిలో ఇతనూ ఉన్నాడని సునీత తరఫు లాయర్లు వెల్లడించారు. దీంతో ఉదయ్‌కి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

News April 15, 2025

IPL: నిన్న చెన్నై గెలిచినా..

image

ఈ సీజన్లో ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. గుజరాత్ మినహా టైటిల్స్ గెలిచిన జట్లేవీ ఈసారి టాప్-4లో లేవు. చెన్నై, SRH, RR, MI చివరి నుంచి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. చెన్నై నిన్న లక్నోపై గెలిచినా ఇంకా చివరిస్థానంలోనే ఉండటం గమనార్హం. ధోనీ సేన 7 మ్యాచుల్లో రెండు మాత్రమే గెలిచింది. నెట్ రన్‌రేట్ -1.276 ఆ జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. మరి ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరే 4 జట్లేవో కామెంట్ చేయండి.

News April 15, 2025

మళ్లీ అనారోగ్యం.. భేటీకి హాజరుకాకుండానే..

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఇవాళ సచివాలయంలో జరుగుతున్న క్యాబినెట్ భేటీలో పాల్గొనేందుకు వచ్చారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో మీటింగ్ మొదలుకాకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఆయన క్యాంప్ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ పవన్ పలుసార్లు అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరైన విషయం తెలిసిందే.

error: Content is protected !!