News April 14, 2025

రాజధాని కోసం మరోసారి భూ సమీకరణ?

image

AP: రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని కోసం మరో 30 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. గతంలోనే 29 గ్రామాల్లోని 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించింది. ఇప్పుడు తూళ్లురు, అమరావతి, తాడికొండ, మంగళగిరిలో ఈ భూ సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News April 12, 2026

MLG: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

image

మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News April 12, 2026

ప్రచారంలో బ్రేక్.. IPL చూసిన సీఎం

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం స్టాలిన్ కాసేపు రిలాక్స్ అయ్యారు. కారులో వెళ్తూ ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన IPL మ్యాచ్ వీక్షించారు. ‘హై ఓల్టేజ్ ప్రచారంలో IPL బ్రేక్. సంజూ శాంసన్ సెంచరీ చేసినప్పటికీ.. నా అభిమాన క్రికెటర్ ధోనీని మిస్ అవుతున్న భావన పోవడం లేదు’ అని ట్వీట్ చేశారు. మ్యాచ్ చూస్తున్న ఫొటో షేర్ చేశారు. తమిళనాడులో ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి.

News April 12, 2026

త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ధురంధర్-2 నటుడు?

image

ధురంధర్-2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ స్నేహితుడిగా కనిపించిన ఉదయ్ వీర్ సంధును టాలీవుడ్‌కు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే47’లో విలన్ పాత్రకు సంధును ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ధురంధర్-2లో సంధు కొద్దిసేపే కనిపించినా నటనతో ఆకట్టుకున్నారు. ఆయన అంతకుముందు అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ మూవీలో కనిపించారు.