News March 2, 2025
భూ సర్వే.. ఆ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు!

TG: రాష్ట్రంలో పొలాల సరిహద్దు సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో తీసుకురానున్న భూభారతి చట్టం ప్రకారం భూముల అమ్మకాలు, కొనుగోళ్ల సమయంలో మ్యాప్ తప్పనిసరి చేయనుంది. దీని కోసం రాబోయే ఆరు నెలల్లో భూములను సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రతి మండలానికి డిజిటల్ సర్వే పరికరం కొనుగోలు చేయనుంది. అదే సమయంలో సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో ఉంది.
Similar News
News March 23, 2025
నరైన్ ‘హిట్ వికెట్’.. ఎందుకు ఔట్ ఇవ్వలేదంటే?

నిన్న RCBతో మ్యాచ్‌లో KKR బ్యాటర్ సునీల్ నరైన్ ‘హిట్ వికెట్’పై చర్చ జరుగుతోంది. MCC నిబంధనల ప్రకారం బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదా పరుగు తీసే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. అయితే నిన్న బంతి నరైన్ పైనుంచి వెళ్లి కీపర్ చేతిలో పడ్డ తర్వాత బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ బంతిని వైడ్‌గా ప్రకటించారు. అందుకే దాన్ని నరైన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.
News March 23, 2025
బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS

బంగ్లాలో హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ఆందోళన వ్యక్తం చేసింది. అఖిల భారతీయ ప్రతినిధి సభ(ABPS)లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ‘బంగ్లాలో హిందువులపై ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడుతున్నారు. మైనారిటీలను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఇస్లామిస్ట్ శక్తుల చేతిలో మైనారిటీలు నరకాన్ని చూస్తున్నారు’ అని అందులో పేర్కొంది.
News March 23, 2025
ఇలాగే ఆడితే RCBదే కప్: పఠాన్

ఆర్సీబీ ‘ఈసాల కప్ నమ్దే’ కోరిక ఈసారి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ఆర్సీబీకి మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. కచ్చితంగా టాప్-4లో ఉంటారు. ఫస్ట్ మ్యాచ్‌లో దక్కిన శుభారంభాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా. కెప్టెన్ పాటీదార్ రిస్కులు తీసుకుంటున్నారు. అతనిలో నాకు నచ్చేది అదే’ అని పేర్కొన్నారు.