News September 23, 2024

ఆస్కార్ బరిలో ‘లాపతా లేడీస్’.. డైరెక్టర్ ఏమన్నారంటే?

image

ఆస్కార్ 2025కి ‘లాపతా లేడీస్’ మూవీని పంపనున్నట్లు <<14173124>>ప్రకటించడంపై<<>> దర్శకురాలు కిరణ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తన సినిమాను అకాడమీ అవార్డ్స్ అధికారిక ఎంట్రీ కోసం ఎంపిక చేయడం గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఇది తన టీమ్ అలుపెరగని కృషికి దక్కిన గుర్తింపు అని తెలిపారు. హృదయాలను ఆకట్టుకోవడానికి, సరిహద్దులను చెరిపివేయడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమమని రాసుకొచ్చారు.

Similar News

News October 15, 2024

భూముల రీసర్వే.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

AP: భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. భూసమస్యలపై ఈ గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

News October 15, 2024

భారత దౌత్యవేత్తలను బహిష్కరించిన కెనడా

image

కెనడాలోని భారత హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం బహిష్కరించింది. వారు కచ్చితంగా తమ దేశాన్ని వీడాల్సిందేనని, దౌత్యవేత్తలుగా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ ఆరుగురు తమ దేశంలో క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని, పబ్లిక్ సేఫ్టీకి విఘాతం కలిగించారని సంచలన ఆరోపణలు చేసింది. కాగా, కెనడా ఈ ప్రకటన చేయకముందే భారత్ ఆ ఆరుగురు <<14357189>>దౌత్యవేత్తలను<<>> వెనక్కి పిలిచింది.

News October 15, 2024

ఇస్రో చీఫ్‌కు వరల్డ్ స్పేస్ అవార్డు

image

ఇస్రో చీఫ్ సోమనాథ్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024ను అందుకున్నారు. మిలాన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో దానికి గుర్తుగా ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించిందని, చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది.